ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విపక్ష పార్టీలు.. అధికార బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బెంగాల్ సీఎం మమత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయా పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. భద్రతకు ముంబై క్షేమం కాదంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. కేజ్రీవాల్ ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రస్తావన..
విపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ముంబై సురక్షితమైన ప్రాంతమని.. ఒక్క ఘటనతో బీజేపీపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. భారత్‌లో అన్ని మెగా సిటీల్లో.. ముంబైనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడితో భద్రతపై విమర్శించడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఐటీ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. దొంగ అలజడితో నిద్ర లేచిన సైఫ్ అలీఖాన్.. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తిరగబడ్డాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆరు కత్తి పోట్లు అయినట్లు సమాచారం. వెన్నెముకకు తీవ్రమైన గాయం కావడంతో సైఫ్‌కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌కి అతిపెద్ద మద్దతుదారులు భారతీయులే.. తాజా సర్వేలో వెల్లడి..