Russia: రష్యన్ ఆయిల్ టైకూన్ అనుమానాస్పద మృతి.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత నాలుగో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లుకోయిల్ వైస్ ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ తన కార్యాలయంలో ఆత్మహత్య పాల్పడ్డారు. మార్చి 12న రాబర్టస్ మరణించాడని లుకోయిల్ సంస్థ చెప్పినట్లు యూరో న్యూస్ నివేదించింది. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ డిప్యూటీ సీఈవో విటాలీ రాబర్టస్(53) అకస్మాత్తుగా మరణించారని ఉక్రేనియన్-అమెరికన్ ఆర్థికవేత్త రోమన్ షరెమెటా ట్వీట్ చేశారు. అయితే మరణానికి కారణాలను వెల్లడించలేదు.
Read Also: Hijab : గుజరాత్లో హిజాబ్ వివాదం.. ప్రిన్సిపాల్ పై విద్యాశాఖ చర్య
Also Read
- INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
స్థానిక రష్యన్ మీడియా కథనాల ప్రకారం… రాబర్టస్ తన మరణానికి ముందు తలనొప్పిగా ఉందని చెప్పాడని, అతని కార్యాలయానికి వెళ్లే ముందు మందులు అడిగినట్లు తెలిసింది. అనంతరం అతని గదిలోకి వెళ్లి ఉరేసుకుని కనిపించాడు. చాలా గంటల పాటు అతడు బయటకు రాకపోవడంతో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆఫీసులోకి వెళ్లి చూసేలోపు ఉరి వేసుకుని కనిపించారు. అతను లుకోయిస్ కంపెనీలో 30 ఏళ్లుగా పనిచేశాడు.
ఈ మరణంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇలా ప్రముఖ వ్యాపారవేత్తలు మరణించిన సంఘటనల్లో ఇది నాలుగో ఘటన. అంతకుముందు మే 2022లో లుకోయిల్ టాప్ మేనేజర్ 43 ఏళ్ల అలెగ్జాండర్ సుబోటిన్, మైటిష్చి పట్టణంలోని ఇంటి నేలమాళిగలో చనిపోయారు. డ్రగ్స్ వల్ల గుండెపోటుతో మరణించారని ఆరోపించారు. సెప్టెంబర్ 2022లో లుకోయిల్ మాజీ చైర్మన్ 67 ఏళ్ల రవిల్ మగనోవ్ మాస్కోలోని సెంట్రల్ క్లీనికల్ హాస్పటల్ కిటికీ నుంచి పడి మరణించారు. అక్టోబర్ 2023లో లుకోయిల్ బోర్డు ఛైర్మన్ 66 ఏళ్ల వ్లాదిమిర్ నెక్రాసోవ్ గుండె వైఫల్యంతో మరణించారు.
తాజావార్తలు
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!