ICMR Serve: ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి. గడచిన 10 ఏళ్లల్లో 30 శాతం పట్టణీకరణ పెరిగిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. గ్రామాల్లో చేసుకోవడానికి పనులు లేకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు.. పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు మధ్య తేడా ఉంటుంది. అది చదువులోనూ.. ఇతర గుణగణాల్లోనూ. అయితే పట్టణ ప్రాంత విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కంటే ఈ మధ్య కాలంలో శారీరకంగా కొంత బలహీనంగా కనబడుతున్నారని కొన్ని నివేదికలు ప్రకటించాయి. 1990 కంటే ముందు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కంటే పట్టణ ప్రాంత విద్యార్థుల శారీరకంగానూ.. మానసికంగానూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కంటే మెరుగుగా ఉన్నారని.. కానీ ఇపుడు మారిన జీవన విధానంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులే .. పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే మెరుగ్గా ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది.
Read also: GuruPurnima: గురు పూర్ణిమ శుభవేళ ఈ అభిషేకం వీక్షిస్తే కష్టాలు తొలగి సకల సంపదలు చేకూరుతాయి
పట్టణాల్లో ఉండే వాతావరణం వేరు. అక్కడ ఉండే ప్రజలు కూడా వేరుగానే ఉంటారు. పట్టణ ప్రాంత పిల్లలు అన్నింటా ముందుంటారని సాధారణంగా అనుకుంటారు. అయితే అది ఒక అపోహ మాత్రమేనని తాజా అధ్యయనం తేల్చింది. 1990 తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ మారిందని, శారీరకంగా, మానసికంగా ఎదగటంలో గ్రామీణ ప్రాంత పిల్లలతో పోల్చితే పట్టణ ప్రాంత పిల్లలు వెనుకబడి ఉన్నారని ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ అధ్యయనం పేర్కొంది. చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం, పరిస్థితులు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది తెలుసుకునేందుకు తాము అధ్యయనం చేసినట్టు పరిశోధకులు తెలిపారు. అధ్యయన నివేదిక ప్రకారం.. 1990 కంటే ముందు దేశవ్యాప్తంగా పట్టణాల్లో 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల అనేది గ్రామీణ ప్రాంత పిల్లలతో పోల్చితే మెరుగ్గా ఉండేది. బలంగా, ఎత్తుగా ఉండేవారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతో అవకాశముందని 1990 తరువాత పట్టణాలకు వలసలు పెరిగాయి. అయితే 1990-2020 మధ్యకాలంలో పట్టణాల్లో పరిస్థితులు మారిపోయాయి. పట్టణ వాతావరణం..పిల్లల ఎదుగుదల, అభివృద్ధికి దోహదపడటం లేదని… ఎత్తు, శారీరక బలం విషయంలో 2020 నాటికి గ్రామీణ పిల్లలే మెరుగ్గా ఉన్నారని.. పట్టణ ప్రాంత పిల్లలు వెనుకబడిపోయారని నివేదికలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు శారీరక శ్రమ చేస్తూనే తమ చదువులను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల్లో చదువుతూ.. తమకు నచ్చిన విధంగా ఉంటున్నారు. దీంతో పట్టణ ప్రాంత విద్యార్థులకు దేనిలో తీసిపోకుండా వారి కంటే మెరుగ్గా తయారవుతున్నారు.