Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి?.. నకిలీ పోస్ట్‌ను ఛేదించిన పోలీసులు
- భారత్ లో మతపరమైన ఆటంకాలు సృష్టించాలని పాక్ ప్రయత్నం..
- కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి అంటూ తప్పుడు ప్రచారం..
- ఎక్స్ వేదికగా చేసిన నకిలీ పోస్టు వివరాలను సేకరిస్తున్న కర్ణాటక పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colonel Sofiya Qureshi: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మతపరమైన సమస్యలను సృష్టించాలనే లక్ష్యంతో సైబర్ దాడులకు దిగుతుంది దాయాది దేశం. తాజాగా, ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, కర్ణాటకలోని బెళగావిలో ఉన్న కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతుదారులు ధ్వంసం చేశారని అందులో పేర్కొంది.
Read Also: Shocking News: ప్రస్తుత ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడానికి కారణం ఇదే..!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇక, ఈ పోస్ట్ వైరల్ కావడంతో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు ఆ పోస్ట్ చేసిన ఎక్స్ ప్రొఫైల్ పేరు “అనిస్ ఉద్దీన్” అని ఉంది. ఆ లొకేషన్ బ్రిటిష్ కొలంబియా, కెనడా అని చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ 405 హ్యాండిల్స్, 31 మంది ఫాలోవర్లను కలిగి ఉందన్నారు. ఇందులో చాలా పోస్ట్‌లు పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నాయని గుర్తించారు. కవర్ ఇమేజ్‌లో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నా, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇతర ఉన్నత పాకిస్తాన్ రక్షణ అధికారుల ఫోటోలు దర్శనమిచ్చాయి.
Read Also: Pakistan Envoy: అమ్మాయితో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు
కాగా, ఇండియన్ ఆర్మీ అధికారి కుటుంబంపై చేసిన ఈ పోస్టు కలకలం రేపుతుంది. భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి చేయలేదని కర్ణాటక పోలీసులు తేల్చి చెప్పారు. ఇది నకిలీ పోస్ట్.. ఇలాంటి వాటిని నమ్మొద్దని అన్నారు. ఈ పోస్ట్‌ను సృష్టించిన వారి కోసం గాలిస్తున్నాం.. వెంటనే దీన్ని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని బెళగావి ఎస్పీ హెచ్చరించారు. అయితే, కల్నల్ ఖురేషి గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. ఆమె బెళగావికి చెందిన కల్నల్ తాజుద్దీన్ బాగేవాడిని వివాహం చేసుకున్నారు. కల్నల్ ఖురేషి అత్తమామలు బెళగావిలో నివాసం ఉంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!