Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Drums, Rs 3.20 Crore Cash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీగా నగదు బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. భూమి కింద పాతిపెట్టిన మూడు నీలిరంగు డ్రమ్‌లలో కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నగదును లెక్కించగా ఏకంగా రూ.3 కోట్ల 20 లక్షల 93 వేల నగదు ఉన్నట్లు వెల్లడైంది. నగదు లెక్కింపు పూర్తయినప్పటికీ, ఆ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని నగదు నిల్వలు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఇంటి లోపల, ఆవరణలో తవ్వకాలు చేపడుతున్నారు.
మూడు డ్రమ్ముల్లో కోట్ల రూపాయలు
ప్రయాగ్‌రాజ్‌లోని గంగానగర్ జోన్ పరిధిలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బరైపూర్ రామ్‌నగర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 28న భూమి కింద పాతిపెట్టిన మూడు నీలిరంగు డ్రమ్‌లను అధికారులు గుర్తించారు. వాటిలో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు బయటపడింది. ఆదాయపు పన్ను శాఖ బృందం నగదు మొత్తాన్ని పూర్తిగా లెక్కించగా, మొత్తం రూ.3,20,93,000 లభించినట్లు సమాచారం.
Also Read
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
నగదు దొరికినా.. ఇంట్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి
మూడు డ్రమ్‌లలో లభించిన నగదు లెక్కింపు పూర్తయినప్పటికీ, అధికారులు అక్కడి దర్యాప్తును నిలిపివేయలేదు. ఆ ఇంట్లో ఇంకా నగదు లేదా ఇతర విలువైన వస్తువులు దాచిపెట్టి ఉండవచ్చనే అనుమానంతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇంటి గదులు, ఆవరణతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అధికారులు పరిశీలనలు చేస్తున్నారు.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఘటనా స్థలంలోనే మకాం వేశారు. దర్యాప్తులో భాగంగా ఇంటి లోపల, బయట సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ ఇంట్లో నివసిస్తున్న రాజేష్ యాదవ్, రాకేష్ యాదవ్‌లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు ప్రధానంగా రెండు ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బును మూడు డ్రమ్‌లలో నింపి భూమి కింద ఎందుకు పాతిపెట్టారు? ఇంట్లో జరుగుతున్న తవ్వకాలు, విచారణ పూర్తయిన తర్వాత ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!