Viral News: రూ.18 కే సైకిల్.. అదేంటీ.. అంత తక్కువ ధరకు సైకిల్ ఇస్తున్నారని అనుకుంటున్నారా?.. అవును రూ. 18 కే కొత్త సైకిల్ ఇస్తున్నారు. అది కూడా బెల్, లైట్‌తో కలిపి. అదేంటీ అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారని అనకుంటున్నారా? రూ. 18కే సైకిల్ ఈ కాలంలో కాదండీ.. అదీ 1934లో కొత్త సైకిల్ ధర.. అదేంటీ మరీ అప్పుడు కొన్న సైకిల్ గురించి ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అదేంటంటే..
Read also: Manikonda: జొల్లి కిడ్స్ ప్లే స్కూల్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కారణంగానే ప్రమాదం..?
మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ప్రతీ రశీదును చాలా జాగ్రత్తగా దాచి పెడతారు. ఇక ఇంట్లోని కరెంట్ బిల్లలు, వాటర్ బిల్లులతోపాటు ఇతర ఏ బిల్లులను చెల్లించిన వాటిని జాగ్రత్తగా దాచిపెట్టమని మనకు చెబుతారు.. అవకాశం ఉంటే వారే జాగ్రత్తగా దాచి పెడతారు. మనం చెల్లించిన బిల్లులనే జాగ్రత్తగా దాచిపెట్టే వాళ్లు మనం కొత్తగా ఏవైనా వస్తువులు కొంటే వాటి బిల్లులను దాచి పెట్టరా? ఎందుకు దాచి పెట్టరు.. బిల్లులతోపాటు గ్యారంటీ, వారంటీ కార్డులు, బిల్లులను కూడా దాచి పెడతారు. అలా దాచిపెట్టిన తరువాత ఎప్పుడైన వస్తువులు పాడైతే వాటి ద్వారా గ్యారంటీతో రిపేర్లు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో బీరువాలు. అల్మారా సొరుగులు సర్దుతున్నప్పుడు, ఏదైనా వెతుకుతున్నప్పుడు పాత పేపర్లు, పాత ఫోటోలు దొరుకుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితంకు సంబంధించిన విషయాలు ఇలాంటి సందర్భాలలో బయటపడుతుంటాయి. ఓ వ్యక్తి తన ఇంట్లో బీరువాలో ఏదో వెతుకున్నాడు. అతనలా వెతుకుతోంటే అతనికి ఓ కాగితం కనిపించింది. కాగితం పాతగా ఉండటంతో అదేంటా అని విప్పి చూశాడు. అలా చూసిన అతనికి పెద్ద షాక్ తగిలింది. 90ఏళ్ళ క్రితం 18 రూపాయలతో కొనుగోలుకు సంబంధించిన బిల్ పేపర్ తనకు దొరికిందని పేర్కొంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ బిల్ పేపర్ తో పాటు, ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Read also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
ఓ వ్యక్తి ఏకంగా 90ఏళ్ల క్రితంనాటి కొనుగోలు రశీదు దొరికింది. 1934వ సంవత్సరంలో కలకత్తాలో కుముద్ సైకిల్ వర్క్స్ పేరుతో ఉన్న షాప్ లో ఒక సైకిల్ కొనుగోలు చేశారు. ఆ సైకిల్‌ను జనవరి 7, 1934లో కొనుగోఉ చేశారు. సైకిల్‌కి బెల్తోపాటు లైట్ కూడా ఇస్తున్నట్టు బిల్లో రాశారు. అంటే అప్పుడు సైకిల్‌కి రాత్రిపూట కూడా కనబడేలాగా ఇపుడు స్కూటర్, బైక్‌లకు ఉంటున్నట్టుగా లైట్ ఉండేది. అవి రెండు కలిపి సైకిల్‌ను రూ. 18కి అమ్మినట్టు రశీదు ఇచ్చారు. ఈ సైకిల్ విలువ అప్పటికి అక్షరాలా 18 రూపాయలు. కాలంతో పాటు సైకిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో బయటపడిన ఈ సైకిల్ బిల్లు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఈ బిల్లుకు సంబంధించిన ఫోటోను పుష్పిత్ మహరోత్ర అనే వ్యక్తి తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశాడు. 90ఏళ్ళ కిందటి సైకిల్ బిల్లు బీరువాలో దొరికింది. అప్పట్లో 18రూపాయలంటే ప్రస్తుతం 1800రూపాయలతో సమానం అనుకుంటున్నాను. నిజమేనా? అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అప్పటికాలంలో బంగారం ధర 10గ్రాములు 28రూపాయలే, దీంతో పోలిస్తే ఆ సైకిల్ ధర చాలా ఎక్కువ అని ఒకరు కామెంట్ చేశారు. అప్పట్లో ఆర్మీ ఛీఫ్ శాలరీ నెలకు 250రూపాయలే, ఇప్పుడు ఆర్మీ చీఫ్ శాలరీ 2లక్షలకు పైమాటే అని ఇంకొకరు కామెంట్ చేశారు. దీన్ని బట్టి అప్పటికి సైకిల్ ధర ఎక్కువే అని అంటున్నారు.