Manikonda: జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. ఏసీ కారణంగానే ప్రమాదం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manikonda: హైదరాబాద్ మణికొండలోని ఓ ప్రైవేట్ ప్లే స్కూల్‌లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. దీంతో పాఠశాలలోని చిన్నారులు భయంతో పరుగులు తీశారు.
హైదరాబాద్ మణికొండలోని జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లే స్కూల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో ప్లే స్కూల్‌లోని చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని ప్లే స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకుని వారి పిల్లల భద్రతపై ఆరా తీశారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
వారి పిల్లలను అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్లే స్కూల్ సిబ్బంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్లే స్కూల్‌లో 100 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. తరగతి గదిలోని ఏసీ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారులు ఉపయోగించే పలు బొమ్మలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!