ICMR: చక్కెర, ఉప్పును పరిమితం చేసి, ప్రొటీన్ సప్లిమెంట్లను నివారించండి.. కొత్త ఆరోగ్య మార్గదర్శకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బుధవారం దేశంలోని ప్రజల కొసం ఆహార మార్గదర్శాలకు విడుదల చేసింది. దేశంలో అవసరమైన పోషకాల అవసరాలను తీర్చడానికి, అసంక్రమిత వ్యాధుల్ని నివారించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. భారదేశంలోని మొత్తం వ్యాధుల్లో 56.4 శాతం అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణం అవుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు కీలకంగా మారనున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) 13 ఏళ్ల తర్వాత మార్గదర్శకాలను సవరించింది.
ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కరోనరీ హార్ట్ డీసజ్(CHD) మరియు హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)ని తగ్గిండచమే కాకుండా, టైప్-2 డయాబెటిస్‌ని 80 శాతం వరకు నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల అకాల మరణాలను గణనీయంగా నివారించవచ్చని పేర్కొంది. 148 పేజీల నివేదిక, 17 మార్గదర్శకాలను కలిగి ఉంది. వంటనూనెల వినియోగాన్ని తగ్గించి, బదులుగా గింజలు, నూనె గింజలు, సముద్ర ఆహారం ద్వారా ఫ్యాటీ యాసిడ్స్ పొందాలని సిఫారసు చేసింది.
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
READ ALSO: Oleander Flowers: “ఒలియాండర్ పూలు” కేరళ ఆలయాల్లో నిషేధం.. కారణం ఏంటంటే..?
చక్కెరలు, కొవ్వులు కలిగిన ప్రాసెస్ చేయబడిన ఆహారాల అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, విభిన్న ఆహార అలవాట్లు దేశంలో మైక్రోన్యూట్రీషియంట్స్ లోపాలు, అధిక బరువుకు కారణమవుతున్నాయని చెప్పింది. ఉప్పు, నూనె, కొవ్వులను పరిమితంగా తీసుకోవాలని, సరైన వ్యాయామం చేయాలని, చక్కెర, ఆల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తగ్గించాలని ఇన్స్టిట్యూట్ సిఫారసు చేసింది. భారతీయులు రోజుకు 20-25 గ్రాములు చక్కెర తినాలని, ఇది సహజ కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుందని పేర్కొంది.
ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ నేతృత్వంలో భారతీయుల కోసం రూపొందించిన ఆహార మార్గదర్శకాలు అనేక శాస్త్రీయ సమీక్షలకు లోనయ్యాయి. బాడీ బిల్డింగ్, బాడీ మాస్ నిర్మించడానికి ‘ప్రోటీన్ సప్లిమెంట్’లను నివారించడాలని ఎన్ఐఎన్ ప్రజల్ని కోరింది. ప్రోటీన్ పౌడర్లను ఎక్కువ కాలం తీసుకోవడం లేదా అధిక గాఢత తీసుకోవడం వల్ల ‘బోన్ మినరల్ లాస్’కి కారణం అవ్వడమే కాకుండా కిడ్నీ డ్యామేజ్ వంటి ప్రమాదాలు ముడిపడి ఉన్నట్లు పేర్కొంది.
మొత్తం శరీర ఎనర్జీలో చక్కెర శాతం 5 కన్నా తక్కువగా ఉండాలని, సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు, మిలెట్ల నుంచి వచ్చే కేలరీలు 45 శాతాన్ని మించొద్దని, పప్పులు-బీన్స్-మాంసం నుంచి 15 శాతం వరకు కేలరీలు అందించాలని పేర్కొంది. మిగిలిన కేలరీలు గింజలు, కూరగాయలు, పండ్లు మరియు పాల నుండి రావాలి. మొత్తం ఎనర్జీలో కొవ్వులను తీసుకోవడం 30 శాతం శక్తి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలని మార్గదర్శకాలలో చెప్పారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!