Pushpa 2: పుష్ప సినిమా చూస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- పుష్ప 2 థియేటర్‌లో రియల్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్..
- సినిమా చూస్తుండగా అరెస్ట్ చేసిన నాగ్‌పూర్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ ల్యాండ్‌లో సత్తా చాటింది. అయితే, ఇలాంటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ని పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు.
రెండు హత్యలు, పోలీసులపై దాడులకు సంబంధించి హింసాత్మక చరిత్ర ఉణ్న విశాల్ మెష్రామ్‌ని గురువారం సినిమా క్లైమాక్స్ సమయంలో థియేటర్ నుంచి అరెస్ట్ చేవారు. ఇతడిపై మొత్తం 27 కేసులు ఉన్నాయి. 10 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. సైబర్ నిఘా, అతడి కొత్త ఎస్‌యూవీ ద్వారా మెష్రామ్ కదలికల్ని పోలీసులు ట్రాక్ చేశారు. అతను తప్పించుకోకుండా థియేటర్ బయట ఉన్న అతడి వాహనంలోని టైర్లలో గాలి తీసేశారు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
Read Also: Sambhal: సంభాల్‌లో బయటపడుతున్న పురాతన ఆనవాళ్లు.. వెలుగులోకి 1857 నాటి బావి..
పోలీసులు థియేటర్‌లోకి ప్రవేశించి, సినిమాలో మునిగిపోయిన గ్యాంగ్‌స్టర్ తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వేగంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన థియేటర్‌లోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. నిందితుడిని ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. తర్వాత నాసిక్ జైలుకి ట్రాన్‌ఫర్ చేయనున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 17 రోజుల్లో రూ.1029.90 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా పుష్ప అవతరించింది. ప్రస్తుతం పుష్ప ప్రపంచ వ్యాప్తంగా రూ. 1500 కోట్ల గ్రాస్ దాటేసింది.
తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?