Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ ల్యాండ్‌లో సత్తా చాటింది. అయితే, ఇలాంటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్ స్టర్‌ని పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు.