Site icon NTV Telugu

RBI కొత్త గైడ్‌లైన్స్.. డిజిటల్ ఫ్రాడ్‌కు 85% వరకు పరిహారం..!

Rbi

Rbi

RBI Draft Guidelines: డిజిటల్ ఫ్రాడ్స్ (ఆన్‌లైన్ మోసాలు) బారిన పడి డబ్బులు కోల్పోయిన బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను (Draft Guidelines) విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బాధితులు కోల్పోయిన మొత్తంలో 85 శాతం వరకు లేదా గరిష్టంగా ₹25,000 పరిహారంగా పొందే అవకాశం ఉంది.

Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!

RBI కొత్త ప్రతిపాదనలు – ప్రధానాంశాలు:
పరిహారం మొత్తం: చిన్న తరహా డిజిటల్ మోసాల్లో (Small-value frauds) కస్టమర్లు కోల్పోయిన నెట్ లాస్‌లో 85% వరకు పరిహారం అందుతుంది. అయితే ఈ పరిహారం గరిష్టంగా ₹25,000 కు మాత్రమే పరిమితం చేయబడింది. (ఉదాహరణకు: మీరు ₹20,000 కోల్పోతే, అందులో 85% అంటే ₹17,000 పరిహారం వస్తుంది. ఒకవేళ ₹50,000 కోల్పోతే, 85% మొత్తం ₹42,500 అయినప్పటికీ, గరిష్ట పరిమితి ప్రకారం మీకు ₹25,000 మాత్రమే లభిస్తుంది).

ఎవరికి వర్తిస్తుంది? : సుమారు ₹50,000 లోపు జరిగే డిజిటల్ లావాదేవీల మోసాలకు ఇది వర్తిస్తుంది. దాదాపు 65% ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఈ కేటగిరీలోనే ఉంటున్నాయని RBI గుర్తించింది.

ముఖ్య నిబంధనలు:  

  1. ఈ ప్రయోజనాన్ని ఒక కస్టమర్ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పొందగలరు.
  2. మోసం జరిగిన 5 రోజులలోపు బ్యాంక్‌కు , నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930) కు ఫిర్యాదు చేయాలి.
  3. కస్టమర్ పొరపాటున OTP లేదా పాస్‌వర్డ్ షేర్ చేసిన సందర్భాల్లో కూడా (Unintended negligence) కొన్ని షరతులతో ఈ పరిహారం వర్తిస్తుంది.
  4. నిధుల సేకరణ: ఈ పరిహార మొత్తాన్ని RBI వద్ద ఉన్న ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’ (DEAF) నుండి చెల్లిస్తారు. ఇందులో RBI వాటా 65% ఉండగా, సంబంధిత బ్యాంకులు మిగిలిన మొత్తాన్ని భరిస్తాయి.
  5. అమలు: ఈ నిబంధనలు జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇవి ముసాయిదా దశలో ఉన్నాయి, ప్రజలు , స్టేక్ హోల్డర్స్ ఏప్రిల్ 6, 2026 వరకు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.
  6. ఎప్పుడు సున్నా బాధ్యత (Zero Liability) ఉంటుంది?
    ఒకవేళ మోసం అనేది బ్యాంక్ వైఫల్యం వల్ల లేదా థర్డ్ పార్టీ బ్రీచ్ వల్ల జరిగితే (కస్టమర్ ప్రమేయం లేకుండా), అప్పుడు కస్టమర్‌కు పూర్తి రీఫండ్ లభిస్తుంది.
  7. బ్యాంక్ వైపు నుంచి భద్రతా లోపాలు ఉన్నట్లు తేలితే దానికి బ్యాంకే బాధ్యత వహించాలి.

CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Exit mobile version