Ranya Rao Case: నన్ను ట్రాప్ చేశారు, విచారణలో విలపించిన రన్యా రావు..
- విచారణలో విలపించిన రన్యా రావు..
- తనను ట్రాప్ చేసినట్లు వెల్లడి..
- పరస్పర విరుద్ధ ప్రకటనలు..
- నిజంగా ఎవరైనా ట్రాప్ చేశారా..? అనే అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక డీజీపీ రామచంద్రారావు సవతి కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్‌ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే, విచారణ సంమయంలో రన్యా రావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల ముందు తాను నిర్దోషి అని చెప్పడం కొనసాగించింది. విచారణ సమయంలో విలపించినట్లు తెలిసింది. నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా మరో కొత్త కోణాన్ని వెల్లడించింది. తన వద్ద నుంచి 17 బంగారు కబడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించింది. ఆమె దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా ప్రయాణించినట్లు చెప్పింది. పరస్పర విరుద్ధ వాదనలను విచారణలో వెల్లడించింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
అయితే, ఈ వాదనలతో నటి తనకు తెలియకుండానే స్మగ్లింగ్ రాకెట్‌లో చిక్కుకుందా..? ఆమె తెలిసే ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రన్యా తాను ట్రాప్ చేయబడినట్లు అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. రన్యా నిజంగానే ఈ రాకెట్‌లో చిక్కుకున్నట్లయితే, దీని వెనక ఎవరున్నారనే దానిపై ఆమె వివరాలు వెల్లడించాలని, ఎలా చిక్కుకుందో చెప్పాలని అధికారులు చెబుతున్నారు.
Read Also: PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం
గతేడాది చెన్నైలో జరిగిన స్మగ్లింగ్ సంఘటనతో ఈ కేసుకు కొన్ని పోలికలు ఉన్నాయి. కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్‌లో పాల్గొన్న ఆమె ఫ్రెండ్, ఆమెని బ్లాక్‌మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది. అయితే, రన్యా సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, స్మగ్లింగ్‌లో పట్టుబడటం కూడా కొంత అనుమానాలకు కారణమవుతోంది. ఆమె భర్త జతిన్ హుక్కురి కూడా యూకేలోని ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు. చెన్నై కేసు మాదిరిగానే ఆమెని ట్రాప్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో ఆమెతో నిరంరతం సంప్రదింపులు జరిపిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆమె వద్ద నుంచి మొబైల్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి కోసం అధికారులు అన్వేషణ ముమ్మరం చేశారు. రెండేళ్లుగా రన్యా రావు ఆర్థిక లావాదేవీలను, బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. స్మగ్లింగ్ ద్వారా రన్యా రావు ఏవైనా ఆస్తుల్ని కూడబెట్టిందా..? అని పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..