BJP: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనే కాకుండా.. ప్రియాంకపైనా అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ కామెంట్స్ పై పార్టీ అధినేత జేపీ నడ్డా బిధూరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు కమలం పార్టీ నేతలు చెప్తున్నారు.
Read Also: Renu Desai : 1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్
ఇక, ఈ అంశంపై బీజేపీలో రెండుసార్లు చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే, రమేశ్ బిధూరి పోటీ చేస్తున్న స్థానం నుంచి తప్పించడం లేదా మరో చోటుకి మార్చడంపై కమలం పార్టీ నజర్ పెట్టినట్లు టాక్. ఇటీవల ప్రకటించిన బీజేపీ తొలి జాబితాలో కళ్కాజీ నియోజకవర్గం నుంచి బిధూరి పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే స్థానం నుంచి ఆప్ తరపున ఢిల్లీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలతో ఆ స్థానంలో ఆయనను తప్పించి ఓ మహిళా నేతను పోటీలో ఉంచాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీ టాక్ వినిపిస్తుంది. ఈ అంశంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో పోటీ చేసే బలమైన మహిళా నేత కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు.
Read Also: Yuzvendra Chahal: హోటల్‌లో అమ్మాయితో.. దొరికిపోయిన యుజ్వేంద్ర చహల్!
అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీనే లక్ష్యంగా రమేశ్ బిధూరి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును చెప్తున్నారని ఆరోపించాడు. అంతేకాదు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలనిఆమె తల్లిదండ్రులు పిటిషన్ వేశారని బీజేపీ నేత పేర్కొన్నాడు. అలాగే, కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీపై కూడా సెక్సీయేస్ట్ కామెంట్స్ చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా తీర్చిదిద్దుతామన్నాడు. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.