Rakhi Sawant On Adil Durrani: తన భర్త తనని వేధిస్తున్నాడని, తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఆదిల్ దురానిపై కొంతకాలం నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్న రాఖీ సావంత్.. ఇప్పుడు తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని, వేరే వాళ్లతో బెడ్ షేర్ చేసుకున్నాడని కుండబద్దలు కొట్టింది. కెమెరా ముందు మంచిగా కనిపించే ఆదిల్‌లో ఒక రాక్షసుడు ఉన్నాడని బాంబ్ పేల్చింది. తనతో అతడు చాలా అబద్ధాలు చెప్పించాడని, చంపుతానని కూడా బెదిరించాడని రాఖీ వాపోయింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఆదిల్‌పై ఫిర్యాదు చేసి, అరెస్ట్ చేయించింది.
Hyderabad Traffic: 10 రోజులపాటు ట్రాఫిక్ సమస్యలు.. వాహనదారులకు నరకమే
రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ‘‘అదిల్ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. రకరకాలుగా వేధించేవాడు. తనని హీరో చేయమని చాలాసార్లు నాపై చెయ్యి చేసుకున్నాడు. తనొక పెద్ద వ్యాపారవేత్త అని, కారుతో పాటు బంగ్లా గిఫ్టుగా ఇచ్చానని మీడియా ముందు గొప్పలు చెప్పమనేవాడు. ఒకవేళ అలా చెప్పకపోతే.. నన్ను పెళ్లి చేసుకోనని, నాకు చుక్కలు చూపిస్తానని బెదిరించాడు. వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకుని, ఆ వీడియోలను నాకు పంపుతానన్నాడు. ఆ వీడియోలు చూసి, నేను గుండెపోటుతో చావాలని ఆదిల్ కోరుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా వెళ్తే.. రూ.50 వేలు సుపారీ ఇచ్చి, ట్రక్కుతో నన్ను గుద్దిచ్చి చంపుతానన్నాడు. అదిల్‌కు ఇదివరకే పెళ్లై, విడాకులు అయ్యాయి. ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి మోసం చేశాడు. అతనికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. ఓవైపు అమ్మ చనిపోగా, మరోవైపు భర్త మోసం చేశాడు. ఇప్పుడు నేను జీవచ్ఛవంలా బతికున్నా’’ అంటూ రాఖీ సావంత్ తన ఆవేదన వ్యక్తం చేసింది.
Suryakumar yadav: సూర్యకుమార్ అరుదైన రికార్డు..తొలి భారత క్రికెటర్‌గా!
పోలీసులు ఆదిల్‌ని అరెస్ట్ చేయడానికి ముందు.. ఉదయాన్నే తనని కొట్టడానికి ఇంటికి వచ్చాడని రాఖీ ఆరోపించింది. అప్పుడు తాను వెంటనే పోలీసులకు ఫోన్ చేశానంది. అతడు చాలాసార్లు తన ఇంటికి వచ్చి, బెదిరించాడని తెలిపింది. తనకు తెలియకుండా ఇంట్లో నుంచి డబ్బులతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లాడని ఆరోపణలు చేసింది. కాగా.. రాఖీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐసీసీ సెక్షన్ 406, 420, 498(ఏ), 377 కింద కేసు నమోదు చేశారు. మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. తనకు ఆదిల్‌తో గతేడాది మే 29వ తేదీనే వివాహమైందని గత నెలలో రాఖీ రివీల్ చేసింది.
Kuwait Woman: భారత్‌లో అదృశ్యమైన కువైట్ మహిళ.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ