జలుబు.. ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఎన్ని మందులు వాడినా.. వారం, పది రోజుల వరకూ విడిచిపెట్టదు.

అయితే.. ఈ ఇంటి చిట్కాలతో పాటు జలుబును తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు తరచూ పాటిస్తే.. వేగంగా ఈ వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది.

కొన్ని మిరియాల్ని నెయ్యిలో వేయించి తినాలి. తర్వాత గోరు వెచ్చని పాలు తాగాలి. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, జలుబు తగ్గుతుంది.

కరివేపాకుల్ని పేస్టుగా చేసి, మజ్జిగలో కలిపి, కొన్ని మిరియాలు వేసి తాగితే.. ముక్కులో వచ్చే అలర్జీలు వెంటనే తగ్గిపోతాయి.

ఐదారు తులసి ఆకుల్ని కషాయంగా మరిగించి.. టీ మాదిరిగా చేసుకొని తాగితే.. జలుబుతో పాటు దగ్గు కూడా మాయమవుతుంది.

చింతపండు గుజ్జు, టమోట రసం, మిరియాల పొడి, ఎండు మిరప కాయ, కొంచెం ఉప్పు కలిపి సూప్‌లా తాగితే, జలుబు తగ్గుతుంది.

లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే.. జలుబు వెంటనే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా గుణాలుంటాయి. కొన్ని వెల్లుల్లి ముక్కలను రోస్ట్ చేసి తీసుకుంటే.. జలుబు తగ్గుముఖం పడుతుంది.

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగితే.. జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశనం కలుగుతుంది.

అల్లం టీ వల్ల ఎన్నో లాభాలున్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో అల్లం టీ తాగితే.. వెంటనే రిలీఫ్‌గా ఉంటుంది.