Site icon NTV Telugu

Rajnath Singh: భవిష్యతే చెబుతుంది.. పాక్ అణు పరీక్షలపై రాజ్‌నాథ్‌సింగ్ రియాక్షన్

Rajnath Singh

Rajnath Singh

పాకిస్థాన్‌ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు. భారతదేశం ఏం చేస్తుందో భవిష్యత్ మాత్రమే చెబుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదన్నారు. పాకిస్థాన్ అయినా.. అమెరికా అయినా.. ఇంకే దేశమైనా ఏం చేయాలనుకుంటున్నారో దానిని చేయనివ్వండని స్పష్టం చేశారు. భారతదేశం భయంతోనో.. లేదంటే ఒత్తిడితోనో ఎటువంటి అడుగులు వేయదని క్లారిటీ ఇచ్చారు. భారతదేశం సముచితమని భావిస్తే మాత్రం.. ఏ చర్యనైనా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అది కూడా సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలం.. మరోసారి ట్రంప్ అణు ప్రస్తావన

ఇటీవల సీబీఎస్‌ ఛానల్ నిర్వహించిన ‘‘60 మినిట్స్’’ అనే కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ దేశాలు భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. ఆ దేశాలు చేస్తున్నప్పుడు అమెరికా ఎందుకు చేయకూడదని వ్యాఖ్యానించారు. వాళ్లు రహస్యంగా చేస్తారు.. మేము బహిరంగంగా చేస్తామని చెప్పారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్‌సింగ్ పై విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యలకు చైనా కూడా స్పందించింది. చైనా ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉంటుందని బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: Supreme Court: పైలట్లను నిందించొద్దు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక సూచన

ఇదిలా ఉంటే తాజాగా మరోపారి అణు పరీక్షలపై ట్రంప్ మాట్లాడారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు. అణు సామర్థ్యాల్లో అమెరికాలో మొదటి స్థానంలో ఉంటుందని.. రష్యా, చైనా తర్వాత స్థానాల్లో ఉంటాయని చెప్పారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయం అని అనుకుంటున్నా.. ఇదే విషయంపై ఇప్పటికే పుతిన్, జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అణ్వాయుధాలకు ఖర్చు పెట్టే డబ్బుంతా ఇతర విషయాలపై ఖర్చు చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తాను శాంతిని కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

 

Exit mobile version