Rajnath Singh: డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం
- డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
- మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన పార్టీలకు బుద్ధి చెప్పంది
- బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజిన్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటితో తొలి విడత పోలింగ్‌కు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌కు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి 15 ఏళ్లు తక్కువ సమయం కాదని నేను భావిస్తున్నాను. దేశంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమ బెంగాల్ అందించే వాటా.. గతంలో 10 శాతం ఉండేది. టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 శాతానికి పడిపోయింది. బెంగాల్ ప్రజలు భయం, తీవ్రవాద వాతావరణంలో జీవితాలను గడుపుతున్నారు. ఈసారి మార్పు తప్పక రావాలి. ఇక్కడి తల్లులకు, సోదరీమణులకు నేను భరోసా ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయండి. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రధాని మోడీ పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా సరే అది తప్పక జరుగుతుంది.’’ అని రాజ్‌నాథ్‌సింగ్ భరోసా ఇచ్చారు.
‘‘ఎన్ని సీట్లు గెలుస్తామన్నది నేను కచ్చితంగా అంచనా వేయలేను. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుంది. బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీని గెలుచుకుంటుంది. టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ… ఈ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించాయి. మహిళలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఆ రాజకీయ పార్టీలకు మహిళలే తగిన గుణపాఠం నేర్పిస్తారు.’’ అని అన్నారు.
బెంగాల్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23 కాగా, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
#WATCH | Birbhum, West Bengal: Defence Minister Rajnath Singh says, "…The people of West Bengal gave the TMC three consecutive chances. I believe 15 years is not a short time for a state's development. There are many states in the country that have rapidly developed their… pic.twitter.com/GRkpGCPYPP
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!