Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
- విమాన ప్రయాణికులకు నరకం
- గాల్లో ఉండగా విమానంలో కుదుపులు
- వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం అంటే ఎవరికైనా సరదానే. కానీ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైతే ఎలా ఉంటుంది. కళ్ల ముందు చావు భీతి కనిపిస్తుంది. అచ్చం అలాంటి భయమే ఎదురైంది. విమానంలో గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా కుదుపులు ఏర్పడడంతో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు అరుపులు, కేకలతో వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తోంది. హుబ్లీకి దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా విమానం అదుపు తప్పింది. గగనతలంలో ఉండగా కుదుపులు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హడలెత్తిపోయారు. కొందరు గట్టిగా సీట్లను పట్టుకోగా.. మరికొందరు కేకలు వేశారు. ఇంకొందరు ఏడ్చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. కొందరి ప్రయాణికుల్లో చావు ముఖం కనిపించింది. మొత్తానికి 4 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టాక.. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో బతుకు జీవుడా అంటూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగేశారు. కానీ ప్రయాణికుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నివేదికల ప్రకారం… ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఇది సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు ల్యాండింగ్ ప్రణాళికను మార్చుకోవలసి వచ్చింది.

విమానం ముండ్‌గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు చక్కర్లు కొడుతూ గాలిలోనే ఉంది. ఈ సమయంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికుల ఉద్రిక్త పరిస్థితులను కొందరు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు.. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేదా అప్‌డేట్‌లు ఇవ్వలేదని.. సమాచార లోపం, నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
#Breaking 🚨: Passengers #Panic in #Hubballi bound flight #Fly91 after technical glitch forces it to circle for hours, #flight landed safely in #Bengaluru, #Kempegowda International #Airport#FlightEmergency #AviationNews #FlightSafety #IndiaNews #EmergencyLanding
#turbulence pic.twitter.com/cZJJhkURED— Jiten Ahuja 🇮🇳 🕊️ 🚩 (@AhujaJiten) April 20, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?