నేటి కాలంలో చాలా మంది ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకునే దంపతులు ఉన్నారు. ఇంకొందరు సర్జరీలు కారణంగా ఇద్దరు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితి ఉంది. మరికొందరు ఆర్థిక పరిస్థితులు కారణంగా ఎక్కువ మంది బిడ్డలను కనలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి కాలంలో ఉన్న ఓ మహిళ ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె భాగ్యవంతురాలు కాదు.. కనీసం మధ్యతరగతి కుటుంబం కాదు. చాలా పేద కుటుంబం. అయినా కూడా అంతమంది బిడ్డలను కనింది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం వాస్తవం. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
కవారా రామ్ కల్బెలియా-రేఖ కల్బెలియా(55) భార్యాభర్తలు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలోని లీలావాస్ గ్రామం. తాజాగా 55 ఏళ్ల వయసులో రేఖ 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఉదయపూర్ జిల్లాలోని జాడోల్ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఈ దంపతులకు 16 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం 12 మంది పిల్లలు ఉన్నారు. తాజాగా మరొకరు జన్మించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరు చిన్నారుల మృతి.. దుండుగుడు ఆత్మహత్య
కవారా రామ్ కల్బెలియా ప్రకారం.. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయినట్లు చెప్పాడు. వీళ్లకు కూడా ఒక్కొక్కరికి ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే రేఖ అమ్మమ్మగా ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కవారా స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. అప్పులు చేసి పిల్లల వివాహం జరిపించాడు. అంతేకాకుండా పిల్లల్ని ఏ రోజు స్కూల్‌కు పంపించలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల్ని కనడం మాత్రం ఆపలేదు.
రేఖ తమతో ఇది నాల్గో సంతానం అని అబద్ధం చెప్పిందని డాక్టర్ రోషన్ దరంగి తెలిపారు. ప్రస్తుత ప్రసవాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తెలిసిందన్నారు. చాలా ప్రసవాలు జరగడం.. గర్భాశయం బలహీనపడి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని.. అంతేకాకుండా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని డాక్టర్ హెచ్చరించారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆమె బాగానే ఉంది.