MLA’s car was stolen in Rajasthan: రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే కారు చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజధాని జైపూర్ ను దిగ్భంధం చేసి వెతికినా కారు ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్‌కు చెందిన స్కార్పియో కారు చోరీకి గురైంది. నారాయణ బెనివాల్ వివాక్ విహార్ శ్యామ్ నగర్ లో నివసిస్తున్నాడు. ఎప్పటి లాగేనే ప్లాట్ ముందు తన కార్ ను పార్క్ చేశాడు. ఉదయం లేచి చూడగానే తన కారు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఎమ్మెల్యే బేణివాల్ డ్రైవర్ జగదీష్ శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్ లో దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. కానీ ఎమ్మెల్యే కారు కోసం పోలీసులు ఎంత వెతికినా కనుక్కోలేకపోయారు. ఈ విషయంపై జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ కూడా రంగంలోకి దిగారు. అయినా ఇప్పటి వరకు కారు జాడను, దొంగల జాడను కనుక్కోలేకపోయారు.
ఈ ఘటనపై పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే బెనివాల్ . రాష్ట్రంలో దొంగలకు పోలీసులు అంటే భయం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే వాహనం ఇలా చోరీకి గురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పోలీసులు అడ్డాలు పెట్టి సామాన్యుడిని తనిఖీల పేరుతో ఇబ్బందులుకు గురి చేస్తున్నారని.. దొంగలు, నేరస్తులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. నారాయణ్ బెనివాల్ , నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ కు స్వయానా సోదరుడు.
Read Also: Singapore Open: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
ఈ ఘటనపై విచారణ జరుగుపుతున్నట్లు ఎస్‌హెచ్‌వో శ్రీమోహన్ మీనా తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల వరకు ఎమ్మెల్యే వాహనం ఇంటి బయటే ఉందని.. ఉదయం 7 గంటలకు బాల్కనీ నుంచి బయటకు వచ్చి చూస్తే కనిపించలేదని అధికారి వెల్లడించారు. జైపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసులు బందోబస్త్ పెట్టారు. ఘటనాస్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ ను టార్గెట్ చేశాయి.