Discrimination against Dalit girls.. Police arrested a person: రాజస్థాన్ లో అమానుష సంఘటన జరిగింది. దళిత యువతిపై వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల వివక్ష, అగ్రవర్ణాల అహంకారం ఏ విధంగా ఉంటాయో మరోసారి బహిర్గతం అయింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించినందుకు పిల్లలు భోజనాన్ని పారేయాలని సూచించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదు అయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ ఉదయ్ పూర్ జిల్లా గొగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం పాఠశాలలో ఇద్దరు దళిత బాలికలు కులవివక్షకు గురయ్యారు. శుక్రవారం రోజు బరోడో ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో లాలా రామ్ గుర్జర్ చేసిన వంటను ఇద్దరు దళిత బాలికలు వడ్డించారు. దీనిపై లాలా రామ్ గుర్జర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలికలు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని పారేయాలని విద్యార్థులను ఆదేశించారు. దీంతో విద్యార్థులు భోజనాన్ని విసిరేశారు.
Read Also: Pawan Kalyan: పోలీసులు ధర్మంగా పనిచేయాలి.. తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతా..!!
బాధిత బాలికలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యలుకు తెలియజేయడంతో వారు వంటి మనిషి లాలా రామ్ పై గోగుండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ ( అత్యాచార నిరోధక) చట్టం కింద సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విషయం నిజమని తేలడంతో చర్యలు తీసుకుంటున్నారు. దళిత బాలికు వడ్డించిన ఆహారాన్ని విసిరేసిన మాట నిజమే అని పోలీసులు తెలిపారు. అయితే తన అగ్రకుల అహంకారంతో లాలా రామ్ ప్రతీ రోజు తనకు నచ్చిన అగ్రకులాల పిల్లలతో భోజనాన్ని వడ్డించేవాడు. అయితే శుక్రవారం ఓ ఉపాధ్యాయుడు దళిత బాలికలను భోజనం వడ్డించమని కోరడంతో ఈ వివాదం చెలరేగింది.