కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో… దానిబారినపడి కోలుకున్న వారిపై ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి… తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి.. అయితే, ఈ సమయంలో.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది రాజస్థాన్ సర్కార్.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడగా.. వీరి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాం.. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చామని వెల్లడించారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా.