Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతోంది. రుతుపవనాలు విస్తరించడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదుల, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గల్లంతయ్యారు.