Rahul Gandhi: మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా అధికార వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కావునా, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్‌తో పాటు విజయ్ వాడెట్టివార్, పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, వర్షా గైక్వాడ్, రమేష్ చెన్నితలతో సహా ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి రానున్నారు. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నేటి (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.
Read Also: Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
అయితే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలను గెలుచుకుంది. కాగా, అనేక మంది ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ రచించిన వ్యూహాన్ని ప్రశ్నించారు. హస్తం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. మహా వికాస్ అఘాడి (MVA)కి చెందిన పలువురు సభ్యులు మహారాష్ట్రలో పోటీ చేసేందుకు మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందున కాంగ్రెస్ యొక్క ఎన్నికల సంసిద్ధతపై నేటి సమావేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంవీఎస్ లో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి — కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) వర్గం, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో వచ్చే నెల లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.