Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల రాంచీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీకి ఆయన హాజరుకాలేకపోతున్నారని జైరాం రమేష్ చెప్పారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. ఆప్ నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు హాజరుకానున్నారు. ఈ రోజు రాంచీ వేదికగా ఇండియా కూటమి నేతలు బలప్రదర్శన చేయనున్నారు.
Read Also: Maharashtra: 19 ఏళ్ల మనవరాలిపై పదేళ్లుగా అత్యాచారం.. చివరకు..
రాహుల్ గాంధీ సాత్నాలో ప్రచారంలో ప్రసంగించిన తర్వాత రాంచీలో ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అతను అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాంచీలో జరిగే ‘‘ ఉల్గులన్ న్యాయ్’’ ర్యాలీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం భార్య కల్పనా సోరెన్ కూడా హాజరుకానున్నారు.
అవినీతి కేసుల్లో కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత వారి భార్యలు ప్రధానంగా ఇండియా కూటమి సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాంచీ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఈ ర్యాలీని నిర్వహిస్తోంది.