Site icon NTV Telugu

Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (జూన్ 3న) ఆయన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ భయపడ్డారని విమర్శలు గుప్పించారు. నరేందర్.. సరెండర్ అనగానే ఒక్కసారిగా బెదిరిపోయాడని ఎద్దేవా చేశారు. ట్రంప్ భయంతోనే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణను మోడీ ప్రకటించారని ఆరోపించారు. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

Read Also: Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు.? బయటపడ్డ కీలక విషయాలు..!

అయితే, చైనా, పాకిస్తాన్‌కు భారత్ సత్తా ఏంటో ఇందిరా గాంధీ చూపించారని రాహుల్ గాంధీ అన్నారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అంటూ సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు కూడా ఆపరేషన్ సింధూర్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో పాటు, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి ధ్వంసంపై రాహుల్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతుంది. ఆపరేషన్ సింధూర్‌కి ముందు.. కేంద్రం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇది మరిచిపోక ముందే రాహుల్ ఇవాళ మరోసారి ఆపరేషన్ సింధూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version