Rahul Gandhi: కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ సెటైర్లు.. అమృత్ కాల్ కాదు, మిత్ర్ కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Satires On Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. నిర్మలమ్మ, ప్రధాని మోడీ చెప్తున్నట్లు.. ఇది అమృత్ కాల్ బడ్జెట్ కాదని, మిత్ర్ కాల్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కేవలం సంపన్నులకు మేలు చేస్తుందే కానీ.. పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఎలాంటి మేలు చేయదని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో సరికొత్త ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్ గానీ, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం గానీ, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం గానీ లేదని రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఉన్న ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40 శాతం సంపద ఉందని.. కానీ 50 శాతం పేదలే 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని తెలిపారు. దేశంలోని 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని, అయినా మోడీ ప్రభుత్వం ఈ సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భవిష్యత్తును నిర్మించే రోడ్‌మ్యాప్ కేంద్ర ప్రభుత్వం లేదని ఈ బడ్జెట్ రుజువు చేసిందని రాహుల్ గాంధీ ట్విటర్ మాధ్యమంగా విరుచుకుపడ్డారు.
Madan Mitra: ఒకే భార్యకు ఐదుగురు.. టీఎంసీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ కేంద్ర బడ్జెట్‌పై నిప్పులు చెరిగారు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు.. ఈ బడ్జెట్ గురించి కేంద్రం లక్ష్మీ బాంబ్ తరహాలో మాటలు మాట్లాడింది కానీ, చివరికి చిన్న టపాసులా తుస్సుమందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిండి, పప్పులు, పాలు, వంటగ్యాస్, తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి.. మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేసిందనిఆరోపించారు. బీజేపీపై ప్రజలు నిరంతరం విశ్వాసం కోల్పోతున్నారనడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. “మొత్తంమీద మోడీ ప్రభుత్వం ప్రజల జీవనాన్ని కష్టతరం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ఇది ‘నామ్ బడే ఔర్ దర్శన్ ఛోటే బడ్జెట్’ బడ్జెట్ (పైన పటారం, లోన లొటారం)’’ అని కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పించిన తర్వాత ఖర్గే స్పందించారు.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు.. తిప్పికొట్టిన కేంద్రమంత్రి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!