Priyanka Gandhi: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?
- వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?
- రాయ్‌బరేలీని నిలుపుకోనున్న రాహుల్ గాంధీ..
- ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతను ఏ స్థానాన్ని నిలబెట్టుకుంటారు..? ఏ స్థానాన్ని వదిలేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ రెండు స్థానాల నుంచి భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. చాలా మంది అనుకుంటున్నట్లు ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీనే నిలుపుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: AP Crime: వైన్స్ దగ్గర గొడవ.. ఒకరి హత్య
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ లేకుంటా వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తాననే వార్తలు వినిపించినప్పటికీ, ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ యూపీలో ‘ధన్యవాదయాత్ర’లో మాట్లాడుతూ.. తన చెల్లి వారణాసి నుంచి పోటీ చేస్తే 2-3 లక్షల మెజారిటీతో ప్రధానిని ఓడించే వారని వ్యాఖ్యానించారు.
వయనాడ్‌ని వదులుకోవద్దని కేరళ కాంగ్రెస్ నేతలు రాహుల్‌ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయ్‌బరేలీని నిలబెట్టుకుని, వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019లో అమేథీ నుంచి ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీని ఎంపీగా చేసింది వయనాడ్. మరోవైపు ఈ సారి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలోని 80 స్థానాల్లో 43 స్థానాలను ఇండియా కూటమి గెలిచింది. కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. దేశంలో అధికారంలో చేపట్టాలంటే ఈ రాష్ట్రం కీలకం కావడంతో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని నిలబెట్టుకుంటారనే వాదన కూడా ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!