Rahul Gandhi: పాక్తో భారత్ యుద్ధం.. ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలన్న రాహుల్ గాంధీ
- మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్ పై మండిపడిన రాహుల్ గాంధీ..
- పాకిస్తాన్ తో యుద్ధంలో మనం ఎన్ని విమానాలు కోల్పోయామని క్వశ్చన్..
- దాడి గురించి పాక్ కు ముందస్తుగానే సమాచారం ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను అడిగారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్.. అందులో జై శంకర్ మౌనంపై ప్రశ్నలు సంధించారు. మే 7వ తేదీన జరిగిన ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం అని జైశంకర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు.. అది విపత్కరమని రాసుకొచ్చారు. అలాగే, భారత వైమానిక దళం ఈ ఆపరేషన్‌లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్రశ్నను మరోసారి గుర్తు చేశారు. “మరోసారి అడుగుతున్నాను” పాకిస్తాన్‌కు ముందే సమాచారం తెలియడంతో మనం ఎన్ని విమానాలు కోల్పోయాము?” అని జైశంకర్‌ని అడిగారు. ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్‌కు కొనసాగింపుగా రాసుచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. పోలీసులకు కీలక ఆదేశాలు
Also Read
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
అయితే, ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పై తీవ్రంగా ఆరోపిస్తూ.. ఈ నెల 17న రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అందులో “ఇది ఒక తప్పు కాదు, ఇది నేరం. దేశం సత్యాన్ని తెలుసుకోవాలి,” అని రాసుకొచ్చారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడుల గురించి ముందస్తు హెచ్చరిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వాదించారు. భారత విదేశాంగ మంత్రి “మన దాడి గురించి ముందస్తుగానే పాక్ కు సమాచారం ఇచ్చినట్లు పబ్లిక్‌గా అంగీకరించారని వెల్లడించారు. ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం ఫలితంగా మనం ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేశారు.
EAM Jaishankar’s silence isn’t just telling — it’s damning.
So I’ll ask again: How many Indian aircraft did we lose because Pakistan knew?
This wasn’t a lapse. It was a crime. And the nation deserves the truth. https://t.co/izn4LmBGJZ
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2025
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!