Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert Today: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పూరీకి సుమారు 310 కిలోమీటర్లు, కళింగపట్నానికి 390 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాములోపు విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read
సెప్టెంబర్ 23న కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. సెప్టెంబర్ 24న కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగనుంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 25 వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచి జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.
శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర వైపు కదులుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?