Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన రాహుల్ గాంధీ..
- విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్..
- దేశంలో 88 పేపర్ లీక్స్ జరిగాయని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేపర్ లీక్‌లు దేశ విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, లక్షలాదాది మంది యువత భవిష్యయత్తును ప్రమాదంలో పడేశారని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, కృషి వృధా అయిందని రాహుల్ గాంధీ అన్నారు. పేపర్ లీక్ వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రం ఆగ్రహంతో ఉన్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు.
దేశంలో ఇప్పటి వరకు 80 సార్లు పేపర్ లీక్స్ జరిగాయని, సుమారు 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆయన అన్నారు. కేవలం ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, విద్యా వ్యవస్థలో ఒక విస్తృతమైన నెట్వర్క్ ఫలితమే అని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని విద్యావ్యవస్థలో నియమించడం విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారని అన్నారు.
Also Read
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
ఆర్ఎస్ఎస్-బీజేపీ విద్యావ్యవస్థను నావనం చేసిందని, విద్యా వ్యవస్థ కేవలం డబ్బు సంపాదించే సాధనంగా మారిందని అన్నారు. పేపర్ లీక్‌లో ప్రవేయం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. పదే పదే జరుగుతున్న పేపర్ లీక్స్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
NEET के 22 लाख बच्चों के साथ धोखा हुआ है। पर मोदी जी एक शब्द भी नहीं बोल रहे।
धर्मेंद्र प्रधान जी को अभी हटाइए, या जवाबदेही ख़ुद लीजिए।
Modi ji, SACK Dharmendra Pradhan ji NOW. pic.twitter.com/6FRMMa8AI8
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2026
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!