Rahul Gandhi: మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వినిడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.
Read Also: CM Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు..
అయితే, ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించారు. నిజాలను దేశ ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. ‘‘మోడీ జీ, ఐదు యుద్ధవిమానాల గురించి నిజం ఏమిటి..? దేశానికి తెలుసుకునే హక్కు ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అయితే, ట్రంప్ ఏ దేశం ఎన్ని విమానాలు కోల్పోయాయి, ఆయన వ్యాఖ్యలు రెండు దేశాలకు సంబంధించిందా..? అనే దానిపై స్పష్టత లేదు. వైట్‌హౌజ్‌లో శనివారం రిపబ్లికన్ సెనెటర్లకు ఇచ్చిన విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారకముందే, వాణిజ్యాన్ని ఉపయోగించి తాను యుద్ధాన్ని నివారించినట్లు మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ వ్యాఖ్యలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. 70 రోజుల్లో 24 సార్లు ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.
मोदी जी, 5 जहाज़ों का सच क्या है?
देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025