పూరి జగన్నాథుడి రథయాత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా జగన్నాథుడి రథయాత్రకు భక్తులు హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పూరికి చేరుకుంటున్నారు. దాదాపుగా 10 లక్షల మంది భక్తలు వస్తారని ఒడిశా అధికారులు అంచనా వేస్తున్నారు.
https://youtu.be/9Bpv0H56giY
జగన్నాథుడి రథయాత్రలో జగన్నాథుడు, దేవీ సుభద్ర, బలభద్ర భగవానుడిని మూడు రథాల ద్వారా లాగుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాలు లాగే కార్యక్రమంలో పాల్గొంటారు. జూలై 1, శుక్రవారంతో ప్రారంభం అయ్యే ఈ వేడుక జూలై 9న ముగుస్తోంది. ఇప్పటికే పూరి భక్తులతో నిండిపోయింది. మరోవైపు ఒడిశా ప్రభుత్వం రథయాత్ర కోసం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. 180 ప్లటూన్ల సాయుధ పోలీస్ సిబ్బందితో పాటు 1000 మంది అధికారులతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఆలయం చుట్టుపక్కల, ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి పూరీ రైల్వే స్టేషన్‌లో జగన్‌నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం రాత్రి పరిశీలించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ జగన్నాథ్ రథ యాత్ర సందర్భంగా కళాఖండాన్ని తీర్చిదిద్దారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం అని సందేశం ఇచ్చేలా ఇసుకతో కళాఖండాన్ని రూపొందించారు.
#WATCH | Odisha: Pahandi rituals for #JagannathRathYatra in Puri begins. The participation of devotees in the Rath Yatra has been allowed this time after a gap of two years following the COVID pandemic. pic.twitter.com/XMohDItkIK
— ANI (@ANI) July 1, 2022