Punjab: “ఉనికిలో లేని” శాఖకు 20 నెలలుగా మంత్రి.. ఆప్ సర్కార్‌పై బీజేపీ విమర్శలు..
- ‘‘లేని’’ శాఖకు 20 నెలలుగా మంత్రి..
- పంజాబ్‌లో ఆప్ సర్కార్ బాగోతం..
- భగవంత్ మాన్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం దీనిని గమనించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన సవరణలు చేయడానికి దాదాపుగా 20 నెలలు పట్టింది. మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్కి కేటాయించిన ‘‘పరిపాలన సంస్కరణల శాఖ’’ అసలు ఉనికిలోనే లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ధాలివాల్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను మాత్రమే కలిగి ఉన్నారు.
Read Also: Hamas: మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ధాలివాల్కి మొదటగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖను కేటాయించారు. అయితే, మే 2023లో జనవరిలో జరిగిన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో ఆ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు పరిపాలన సంస్కరణల శాఖను కేటాయించారు. అయితే, తాజాగా పంజాబ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు పరిపాలన సంస్కరణల శాక ఉనికిలో లేదని పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శించింది. దాదాపుగా రెండేళ్లుగా ఉనికిలో లేని శాఖను ఒక మంత్రి ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. ఆప్ పంజాబ్ పాలనను జోక్‌గా మార్చిందని, ఆప్ మంత్రి 20 నెలలుగా లేని శాఖను నడిపాడని, 20 నెలలుగా ఒక సీఎం లేని ఒక శాఖను నడుపుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ఒక శాఖ లేదని తెలుసుకునేందుకు ఆప్ ప్రభుత్వానికి 20 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక మోసగాడు, ఆయన ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!