Punjab: పాక్ ఐఎస్ఐ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
- పాక్ ఐఎస్ఐ మద్దతు కలిగిన టెర్రర్ మాడ్యూల్స్‌ని ఛేదించిన పోలీసులు..
- రాకెట్ లాంచర్లలో సహా భారీగా ఆయుధాలు స్వాధీనం..
- రెండు ఆపరేషన్లలో మైనర్ సహా 13 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: RR vs LSG: మెరిసిన ఐడెన్ మార్క్రామ్, బదోని.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 181
Also Read
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
రెండు ప్రత్యకమైన ఆపరేషన్లలో, కౌంటర్ ఇంటెలిజెన్స్ బలంధర్, బటాలా జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లకు డీజీపీ గౌరవ్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ మాడ్యుల్స్‌ని ఫ్రాన్స్‌కు చెందిన సత్నామ్ సింగ్ అలియాస్ సత్తా, గ్రీస్‌కు చెందిన జస్వీందర్ సింగ్ అలియాస్ మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్నట్లు తేలింది.
మొదటి ఆపరేషన్‌లో జగ్రూప్ సింగ్, జతీందర్ సింగ్ అలియాస్ హనీ, హర్‌ప్రీత్ సింగ్ లను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు సత్నాం సింగ్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రెండవ ఆపరేషన్‌లో, 17 ఏళ్ల బాలుడితో సహా తొమ్మిది మంది అరెస్టును బటాలా ఎస్ఎస్పీ సుహైల్ ఖాసిం మీర్ నిర్ధారించారు. అరెస్టయిన ఇతర వ్యక్తులను పవన్‌ప్రీత్ సింగ్, బల్బీర్ కుమార్ అలియాస్ వరుణ్, గోమ్జీ అలియాస్ గొట్టా, గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపి, అజయ్‌పాల్ సింగ్, రాహుల్ అలియాస్ భైయా, జోహన్సన్ మరియు జతీందర్‌గా గుర్తించారు.
తాజావార్తలు
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!