Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.