Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
- పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం
- బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
- అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ రాజకీయాల్లో సోమవారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బంధువు అయిన జ్ఞాన్ సింగ్ మాన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ సమక్షంలో పార్టీలో చేరారు.
జ్ఞాన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నేను భగవంత్ మాన్ మేనమామ కొడుకును. ఆయన నాకు కజిన్ కూడా. నేను 2014 నుంచి ఆయనతోనే ఉన్నాను. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి నిరంకుశత్వం, అవినీతి కారణంగా నేను ఆ పార్టీని వీడాను. ఇప్పుడు నేను పంజాబ్‌లో బీజేపీ కోసం పనిచేయాలనుకుంటున్నాను. ఇదే నా పార్టీ..’’ అని అన్నారు.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
భగవంత్ మాన్ ఇంటి పక్కనే జ్ఞాన్ సింగ్ మాన్ నివసిస్తున్నారని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ పేర్కొన్నారు. బజిందర్ సింగ్ ఒక ధాబా నడుపుతున్నారని, పంజాబ్ ప్రభుత్వం అతని ధాబాపై జీఎస్టీ దాడులు నిర్వహించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురించి మాట్లాడుతుందని, కానీ పంజాబ్ ప్రభుత్వమే ఒక రెస్టారెంట్‌పై జీఎస్టీ దాడులు నిర్వహించిందని సునీల్ జాఖర్ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. లుధియానా, అమృత్సర్లలో ఆప్ నాయకులు గూండాయిజానికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఈడీ, సీబీఐ దాడులు ఆగవని, ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేస్తామని తెలిపారు.
ਮੁੱਖ ਮੰਤਰੀ ਭਗਵੰਤ ਮਾਨ ਦੇ ਚਚੇਰੇ ਭਰਾ ਗਿਆਨ ਸਿੰਘ ਮਾਨ ਜੀ ਦਾ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਵਿੱਚ ਸ਼ਾਮਿਲ ਹੋਣ 'ਤੇ ਹਰਿਆਣਾ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਾਇਬ ਸਿੰਘ ਸੈਣੀ ਜੀ ਅਤੇ ਸੂਬਾ ਪ੍ਰਧਾਨ ਸ਼੍ਰੀ ਸੁਨੀਲ ਜਾਖੜ ਜੀ ਨੇ ਸਵਾਗਤ ਕੀਤਾ। ਪੰਜਾਬ ਦੀ ਜਨਤਾ ਹੁਣ ਵਿਕਾਸ, ਅਤੇ ਮਜ਼ਬੂਤ ਅਗਵਾਈ ਚਾਹੁੰਦੀ ਹੈ, ਜਿਸਦੀ ਗਾਰੰਟੀ ਸਿਰਫ਼ ਭਾਜਪਾ ਦੇ ਸਕਦੀ ਹੈ।… pic.twitter.com/JH4X9vWcm8
— BJP PUNJAB (@BJP4Punjab) May 11, 2026
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!