Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Punjab Bandh Farmers To Halt Trains And Buses From 7 Am To 4 Pm

Punjab Bandh: రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష.. నేడు పంజాబ్ బంద్కు పిలుపు..

Published Date :December 30, 2024 , 7:18 am
By Chandra Shekhar Pamena
  • ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌..
  • దల్లేవాల్‌కు మద్దతుగా నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
  • బంద్‌కు మద్దతు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, బస్సులు, ట్రైన్స్, దుకాణదారులు
Punjab Bandh: రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష.. నేడు పంజాబ్ బంద్కు పిలుపు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Punjab Bandh: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా ఈరోజు (డిసెంబర్ 30) పంజాబ్ బంద్‌ను రైతులు ప్రకటించారు. నేటి ఉదయం 7 .00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ బంద్‌కు సహకరించాలని ప్రజలకు కోరారు. రాష్ట్రంలో ప్రజలకు పాలు, కూరగాయలు తదితర నిత్యవసర వస్తువులు సరఫరా చేయబోమన్నారు. అలాగే, రహదారులపై వాహనాలు, రైళ్లను సైతం తిరగనివ్వమని తేల్చి చెప్పారు. ఈ రైతుల బంద్‌కు వాణిజ్య సంస్థలు సైతం సపోర్టు ఇచ్చాయి.

Read Also: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం “దిల్ రూబ” టీజర్ డేట్ ఫిక్స్

కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బంద్‌కు సపోర్టుగా మూసి ఉంచాలని రైతు సంఘాల నేతలు కోరారు. అయితే, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రాక పోకలు సాగించే వారికి మాత్రం పర్మిషన్ ఉంటుందన్నారు. నేటి ‘పంజాబ్ బంద్’కు పిలుపునివ్వాలని గత వారం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్)తో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా నిర్ణయించారు. దీంతో ఈ బంద్‌‌కు వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: CM Chandrababu: ఈనెల 31న పల్నాడు జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

అయితే, తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని.. 101 మంది రైతులు గత కొంత కాలంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో శంభు సరిహద్దు వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలిపేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకోవడంతో.. వచ్చే ఏడాది జనవరి 4న ఖౌనౌరీ నిరసన ప్రదేశంలో కిసాన్ మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • banks
  • bus
  • govt offices
  • police
  • Punjab

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions