AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే సుఖ్వీర్ సింగ్ మైసర్‌ఖానాను పార్టీ నుంచి బహిష్కరణ.
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, తప్పుడు పుకార్ల వ్యాప్తి ఆరోపణలు.
- ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతపై ఎమ్మెల్యే ప్రశ్నలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన సొంత ఎమ్మెల్యేపైనే బహిష్కరణ వేటు వేసింది. మౌర్ అసెంంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సుఖ్వీర్ మైసర్‌ఖానాను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి ఆరోపణపై ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను మైసర్ఖాన్ ఎత్తిచూపారు. తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, ఆప్ ఎమ్మెల్యే 14 నిమిషాల లైవ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యను లేవనెత్తారు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పార్టీ కీలక నేతల వద్ద ఈ సమస్యను ప్రస్తావించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను తాను ప్రస్తావించానని, తనకు పార్టీ టికెట్ నిరాకరించినా, పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నించడం ఆపబోనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం కాకుండా ప్రజలు, పిల్లల భవిష్యత్తు కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!