NTV Telugu Site icon

Puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్.. పరారీలో పేరెంట్స్!

Pujakhedkar

Pujakhedkar

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీంతో చిర్రెత్తిన పూణె కలెక్టర్.. పూజా ఖేద్కర్ వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. రంగంలోకి దిగిన సర్కార్.. ఆమెపై వేటు వేసింది. వాషిమ్‌కు బదిలీ చేసింది. ఈ ఘటన ఇలా ఉంటే.. మరోవైపు పూజా తల్లి మనోరమా.. బౌన్సర్లను వెంట వేసుకుని పొలంలో ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆయుధాల చట్టం క్రింద మనోరమా.. అలాగే భర్త పాత్ర కూడా ఉండడంతో దిలీప్ ఖేద్కర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

పూజా తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ కోసం ఇంటికి వెళ్లగా.. ఎవరూ అందుబాటులో లేరు. దీంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కోసం మూడు పోలీస్ బృందాలను ఏర్పాటుచేశారు. ముంబై, పూణె, అహ్మద్‌నగర్‌లో బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. పోలీసులు విచారణకు సహకరించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Shankar: భారతీయుడు 2 అయిపొయింది.. గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాదుకి శంకర్

2023 బ్యాచ్‌కి చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ డ్యూటీలో చేరకముందే అనేక డిమాండ్లు చేసింది. దీంతో జూన్ 24న పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే.. మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్‌కి లేఖ రాశారు. ఖేద్కర్ కలెక్టరేట్‌లో ఉద్యోగంలో చేరకముందు ప్రత్యేక క్యాబిన్, కారు, నివాస గృహాలు, ప్యూన్ కావాలని డిమాండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. రెండేళ్ల ప్రొబేషన్‌లో ఉన్న ఆమెకు ఈ ప్రయోజనాలకు అర్హత లేదని కలెక్టర్‌.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇక అదనపు కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో పూజా ఖేద్కర్.. సీనియర్ అధికారి నేమ్‌ప్లేట్‌ను కూడా తొలగించారని తెలిపారు. దీంతో ప్రభుత్వం.. సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వాషిమ్‌కి పూజాను బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై వ్యాఖ్యానించే అధికారం తనకు లేదని అన్నారు.

ఇది కూడా చదవండి: Mulugu: నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోని హరిత హోటల్.. 4.19 కోట్లతో నిర్మాణం..

ఇక సివిల్స్ సర్వీస్‌లో పూజా ఖేద్కర్.. నకిలీ క్యాష్ట్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. ఈ ఆరోపణలు నిజమైతే పూజా ఖేద్కర్ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై పూజా తండ్రి దిలీప్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. సౌకర్యాలు అడగడంలో తప్పేముందని.. ఎవరో కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు తల్లిదండ్రుల కోసం వేటాడుతుండగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: Heart Touching Video: కొడుకు విజయం చూసి అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..