ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.