Shankar has landed in Hyderabad today to recce locations for Game Changer: శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఊహించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ తో పాటు తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు కూడా నమ్మారు కానీ అనూహ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు తమిళ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కాలేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో సీక్వెల్ కూడా ఉంది అది మరో ఆరు నెలల్లో రిలీజ్ చేస్తామని కూడా సినిమా యూనిట్ చెబుతోంది.
Vishwak Sen: పాపం విశ్వక్ సేన్.. దెబ్బకి అడ్రెస్ మార్చేశాడట?
అదంతా అలా ఉంచితే తాజాగా శంకర్ భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ లో అడుగు పెట్టాడు ఆయన రామ్ చరణ్ తేజ్ తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించి మరో 10 -15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ విషయాన్ని అధికారికంగా భారతీయుడు 2 ప్రమోషన్స్ లో శంకరే వివరంగా చెప్పాడు. ఇక ఇప్పుడు ఈ మిగిలిన 10- 15 రోజుల షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ రెక్కీ చేయడం కోసమే శంకర్ హైదరాబాద్ లో దిగినట్లుగా తెలుస్తోంది. ఆ షూట్ కూడా పూర్తి చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అప్పుడు సినిమా రిలీజ్ డేట్ విషయం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.