Mulugu: ములుగు జిల్లాలో పర్యాటకుల సౌకర్యార్థం గట్టమ్మ దేవాలయం వద్ద రూ.4 కోట్ల 20 లక్షల నిధులతో నిర్మించిన ‘హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్’ సేవలకు నోచేకోలేక పోతుంది. ప్రజలకు అందుబాటులో వున్నా నాలుగేళ్లుగా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మంగపేట మండలం మల్లూరులో తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ నిర్మాణం చేసినా.. పర్యాటకులకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్ నాలుగేళ్లుగా ప్రారంభించకపోవడంతో డోరు అద్దాలు, బీటలు బారిన గోడలు ధ్వంసమయ్యాయి. అందుబాటులో తేవాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. ఈ హోటల్‌లో గదులను బుక్ చేసుకునే సదుపాయం harithagrand.com వెబ్‌సైట్ ద్వారా అందించబడింది. ఆగస్ట్ 22, 2021 లో ప్రారంభానికి సిద్ధమైందని ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లు కూలిపోయి చాలా అందంగా మారిందని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
Read also: Heart Touching Video: కొడుకు విజయం చూసి అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..
తెలంగాణ రాష్ట్ర టూరిజం అధికారులు గుజరాత్‌కు చెందిన ‘లాలూజీ అండ్ సన్స్’ సంస్థతో హరిత గట్టమ్మ హోటల్‌ను 20 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ ప్రతినిధులు ఆ హోటల్ కు ‘హరిత గ్రాండ్ గట్టమ్మ’ అని పేరు పెట్టారు. గట్టమ్మ గుడి వద్ద ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లు, సూట్‌లు, బాంకెట్ హాల్, జాతీయ రహదారికి అభిముఖంగా దాదాపు ఎకరం విస్తీర్ణంలో రెస్టారెంట్‌ను నిర్మించారు. రెస్టారెంట్ వెనుక 9 ఏసీ, నాన్ ఏసీ గదులతో కూడిన బాంక్వెట్ హాల్‌ను నిర్మించారు. రెస్టారెంట్ లో ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో ఆర్డర్ ప్రకారం పర్యాటకులకు నోరూరించే వంటకాలు వడ్డించేందుకు గాను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన ఈ హోటల్ లో విదేశీ పర్యాటకులు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. రెస్టారెంట్ పక్కనే గార్డెన్ నిర్మించి గుడిసెలు వేసుకున్నారు. అయితే ఇన్ని సౌకర్యాలు అందుబాటులో వున్నా ప్రభుత్వం మాత్రం హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్ పై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పందించి హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్ ను పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నారు.
Rakshit Shetty FIR: హీరో రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు!