Heart Touching Video a Mother Cries Tears Of Joy After Son Cracks Ca Exam Goes Viral : మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయల అమ్మే మహిళ కొడుకు హృదయాన్ని హత్తుకునే ఓ పోస్ట్ ను పంచుకున్నారు. చవాన్ యోగేష్ అనే వ్యక్తి కృషి, అతనికి చదువు పట్ల అంకితభావం గురించి చెప్పాడు. యోగేష్ సిఎ అయ్యాడన్న వార్త విన్న యోగేష్ తల్లి ఎంత సంతోషంగా ఉందో తెలిపే వీడియోను పోస్ట్ చేశాడు. చవాన్ తన పోస్ట్‌లో యోగేష్ తల్లి తొంబరే మావాషి అని చెప్పాడు. గిర్నార్ డోంబివాలి ఈస్ట్, గాంధీనగర్ లోని ఒక స్వీట్ షాప్ దగ్గర కూరగాయలు అమ్ముతుంది. దృఢ సంకల్పం, కఠోర శ్రమతో యోగేష్ క్లిష్టపరిస్థితుల్లో కూడా ఈ అద్భుత విజయాన్ని సాధించాడు. అతని విజయం వల్ల ఆమె కన్నీళ్లకు లక్షల విలువ. యోగేష్ విజయం సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చవాన్ తన పోస్ట్‌లో రాశారు. ఈ వార్తతో యోగేష్ తన తల్లిని ఆశ్చర్యపరిచిన వీడియోను కూడా ఆయన షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
iQOO Z9 Lite 5G: అదిరిపోయే ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న iQOO Z9 లైట్…
ఈ వైరల్ వీడియోలో తొంబారే మావాషి రోడ్డు పక్కన ఉన్న తన కూరగాయల దుకాణం వద్ద కూర్చున్నట్లు కనిపించింది. యోగేష్ అతని దగ్గరకు రాగానే ఫలితం గురించి చెప్పాడు. మావ్షి వెంటనే లేచి యోగేష్ ని ఉత్సాహంగా కౌగిలించుకుంది. వీడియోలో మావాషి ఏడుస్తున్నట్లు కనపడుతుంది. ఇది పోస్ట్ చేసినప్పటి నుండి లక్షకు పైగా వీక్షించారు. అలాగే వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. దీనికి నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. ఇందులో ఓ నెటిజన్ “సిఎ పరీక్ష మాత్రమే రిజర్వేషన్ లేని పరీక్ష., ఇందులో విద్యార్థులు మెరిట్, హార్డ్ వర్క్ ఆధారంగా మాత్రమే విజయం సాధిస్తారు. పేద లేదా ధనిక, వెనుకబడిన తరగతి లేదా ఉన్నత కులం అంటూ ఏవి ఉండవని.. కేవలం సిఎ మెరిట్ ఉంటేనే జరుగుతుంది కాబట్టి యోగేష్ కి శుభాకాంక్షలు అని తెలిపారు. ఇంకొక నెటిజన్ మాట్లాడుతూ.. “అభినందనలు యోగేష్. మీ లాంటి వల్ల తల్లిదండ్రులకు గర్వకారణం” అని కామెంట్ చేసాడు.
Donald Trump: నేను చనిపోయాను అనుకున్నాను..
योगेश, तुझा अभिमान आहे.
डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला.
निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61
— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024