Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Protests Against Doctor For Replanting 7 Month Old Baby In Mothers Womb At Karimganj In Assam

Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు

Published Date :September 2, 2022 , 11:58 am
By Mahesh Jakki
Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Assam: కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. మరెంతో మంది ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఏకంగా ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తిసి ఆ శిశువు పూర్తిగా వృద్ధి చెందలేని తెలిసి తిరిగి కడుపులో పెట్టి కుట్టేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఏదో అల్మారాలో వస్తువు తీసి అదికాదు అన్నట్లుగా తిరిగి అల్మారాలో పెట్టేసినట్లుగా గర్భిణి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి ఆ బిడ్డ ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు ఓ వైద్యుడు. ఆ డాక్టర్ చేసిన ఘనకార్యం తెలిసి సదరు గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు.

Boat Accident: పడవ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

అస్సాం కరీంగంజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఓ గర్భిణీ వచ్చింది. నవీ నమశూద్ర అనే ఏడు నెలల గర్భిణి నొప్పులతో డాక్టర్ వద్దకు వెళ్లి పరిస్థితిని చెప్పింది. ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆశిష్‌ కుమార్‌ బిస్వాస్‌ ఆమె ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోలేదు. అంతేకాదు కనీసం ఆమెకు ఎన్ని నెలల గర్భం అని కూడా తెలుసుకోకుండానే డెలీవరీ చేయాలి అంటూ ఏకంగా సర్జరీ చేసేశాడు. తీరా బిడ్డను బయటకు తీశాక..అయ్యో పిండం ఇంకా పూర్తిగా శిశువుగా వృద్ధి చెందలేదు అని తెలుసుకుని తిరిగి బిడ్డను కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు. అదేదో వస్తువును డ్రాలో దాచినట్లుగా పెట్టి కుట్లేసి ఇంటికి పంపించివేశాడు. పది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. తిరిగి ఆస్పత్రికి రావడంతో ఆమెకు సర్జరీ జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేదా అంటూ విరుచుకుపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్కడ‌కు చేరుకుని బాధితుల‌తో మాట్లాడడంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • Karimganj
  • mothers womb after surgery
  • Replanting 7 Month Old Baby
  • Replanting 7 Month Old Baby in Mother's Womb

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions