Supreme Court: వ్యభిచారం చేయడం తప్పు కాదు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచివ్యభిచారం చేస్తూ పట్టుపడిన వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.”వ్యభిచారం చేసే వారిని మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర పరుస్తుంటే చూస్తూ ఉండలేము.. వారిలా పనిచేయడం ఎవరివలన కాదు. ఎవ్వరు స్వచ్చందంగా వ్యభిచారంలోకి దిగాలి అనుకోరు.. ఎవరి బాధలు వారికి ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అలాంటివారి విషయంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యను ఉన్నట్లుగా చర్చించింది లేదు. ఇక వీటి విషయంలో పట్టించుకొనేవారు వారిని ఇంకా వేధించడానికి చూస్తూ ఉంటారు.
వ్యభిచార గృహంలో పట్టుబడడం ఆలస్యం పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడం, మీడియా వారి ఫోటోలను క్లిక్ చేసి అందరికి చూపించి వారి పరువును బయటపెట్టడం. ఇక నుంచి ఇలాంటివాటికి చెక్ పెట్టినట్లే.. వ్యభిచారం చేసే వారిని ఇక నుంచి వేధించకూడదు. వారి ఫోటోలను మీడియా క్లిక్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేయకూడదు. వారికి కూడా సమాజంలో ఒక గౌరవం ఇవ్వాలి. వారిపై భౌతికంగా కానీ మాటలతో కానీ ఎలాంటి దాడి చేయకూడదని పోలీసులు ఆదేశించింది. వారి విషయంలో మర్యాద పాటించాలని పేర్కొంది. ఒకవేళ తమ ఆదేశాలను కాదని మీడియా వారి ఫోటోలను ప్రచురిస్తే వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మరికొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది న్యాయస్థానం..
Also Read
*వ్యభిచారం చేయడం తప్పు.. కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు.
*బలవంతంగా మహిళలను వ్యభిచారం కూపంలోకి తీసుకెళ్లినవారిపై క్రిమినల్ కేసులు పెట్టండి.. వారి వద్ద నుంచి మహిళలను కాపాడి నిర్దిష్ట గడువు లోపు వారిని విడిపించటానికి చర్యలు తీసుకోవాలి.
* గృహాలపై దాడులు నిర్వహించినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న వర్కర్లను అరెస్టు చేయకూడదు. వారిని శిక్షించటం.. వేధించటం కానీ చేయకూడదు
*వ్యభిచారం చేసేవారి పట్ల పోలీసులు అతి క్రూరంగా ప్రవరిస్తున్నారు.. ఇకనుంచి అలాంటివి మానుకోవాలి.. సున్నితంగా వ్యవహరించాలి.
* వ్యభిచార వృత్తిలో ఉన్నారనే కారణంతో వ్యభిచారిణి ల బిడ్డను తల్లి నుండి వేరు చేయకూదు. మానవ మర్యాద మరియు గౌరవానికి సంబంధించిన ప్రాథమిక రక్షణ వర్కర్లు మరియు వారి పిల్లలకు వర్తిస్తుంది.
*ముఖ్యంగా వ్యభిచారం చేసే వారి ఫోటోలు.. వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు.. నిందితుల ఫోటోల్ని ప్రసారం చేయటం..ఫోటోల్ని ప్రచురించటం చేయకూడదు.
*అన్నిటికన్నా ముఖ్యంగా వారిని కూడా సమాజంలో మనుషులుగా చూడాలి.. అది వారి వృత్తి అని నమ్మాలి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!