Priyanka Gandhi: కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి
- కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి
- కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశమివ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుంభమేళాపై విపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని.. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ప్రియాంక కోరారు.
ఇది కూాడా చదవండి: Akshay Kumar : ఫ్లాప్ డైరెక్టర్ తో అక్షయ్ కుమార్ సినిమా..?
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
ఇదిలా ఉంటే మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోడీ కుంభమేళాపై మాట్లాడారు. దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతం అయిందని పేర్కొన్నారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు. ఇక కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఇదొక చారిత్రక ఘట్టమని.. యువత కూడా ఉత్సాహంగా కుంభమేళాలో పాల్గొందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు.. కుంభమేళాతో పటాపంచలయ్యాయని మోడీ అన్నారు.
ఇది కూాడా చదవండి: Warangal: మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు..
మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా కుంభమేళా ముగిసింది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.
"Opposition has sentiments towards Maha Kumbh, should be allowed to speak for two minutes": Priyanka Gandhi
Read @ANI Story https://t.co/p5dDAtuwAi#Mahakumbh #PriyankaGandhi #Congress pic.twitter.com/zuAbypcaug
— ANI Digital (@ani_digital) March 18, 2025
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!