Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు పూర్తి అవనున్నాయి. ఇప్పటికే బీజేపీ 192 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ విషయం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకాగాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: USA: 2050 నాటికి న్యూయార్క్‌తో సహా సముద్రంలో కలవనున్న 32 నగరాలు..
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ఇప్పటికే రాయ్‌బరేలీ పోటీ నుంచి తప్పుకుని, రాజస్థాన్ నుంచి రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నియ్యారు. ఈ పరిణామం తర్వాత ప్రియాంకా గాంధీ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వినిపించాయి. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజల్ని ఉద్దేశించి రాసిన లేఖలో ‘‘ రాయ్‌బరేలీలో మా కుటుంబం యొక్క మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నాకు మరియు నా కుటుంబానికి అండగా ఉంటారని నాకు తెలుసు’’ అని అన్నారు. అయితే, గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. అయితే, ప్రియాంకాగాంధీ పోటీలో ఉంటారో లేదో అని స్పష్టంగా తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!