Site icon NTV Telugu

Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు

Priyankagandhi

Priyankagandhi

రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌ హాల్‌లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. దీంతో ఆమె మీడియాపై రుసరుసలాడారు. రూపాయి విలువ పడితే తనను ఎందుకు అడుగుతున్నారని.. వెళ్లి వాళ్లను అడగండి అని బదులిచ్చారు. ఈ విషయంపై తననెందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో డాలర్ విలువ (రూపాయితో పోలిస్తే) ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నేతలు ఏం ఆరోపించారో తెలియదా? అని మీడియాను నిలదీశారు. రూపాయి విలువ పడిపోతే అడిగేది తనను కాదని.. వెళ్లి వాళ్లను అడగండి అని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా రూపాయి మారకం విలువ పడిపోయింది. నిన్నటి సెషన్‌లో రూపాయి విలువ 90.15 దగ్గర ముగియగా.. గురువారం ఆ క్షీణత మరింత పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయి 90.43 దగ్గర సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్షీణత మరికొన్ని రోజులు ఇలానే కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Exit mobile version