PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం
- నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం
- బీజేపీ విజయోత్సవ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. నవరాత్రి సమయంలో హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం శుభసూచకం అన్నారు. కార్యకర్తల కృషితోనే హర్యానాలో విజయం సాధించామని తెలిపారు. హర్యానా విజయం ప్రజాస్వామ్య విజయం అని అభివర్ణించారు. హర్యానా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని ప్రధాని మోడీ తెలిపారు.
‘‘హర్యానాలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తారు. కానీ ఈసారి బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. బలహీన వర్గాలను కాంగ్రెస్ పట్టించుకోదు. వాళ్లను ఓటు బ్యాంకుగానే చూస్తుంది. కులం పేరంతో కాంగ్రెస్ విద్వేషాన్ని చిమ్ముతోంది. గీతాభూమిలో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయి. జమ్మూకశ్మీర్ ఎన్నికలు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల విజయం. హర్యానాలో అబద్ధాల మూటపై ‘వికాసం’ పైచేయి సాధించింది. ’’ అని మోడీ తెలిపారు.
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు

జమ్మూకాశ్మీర్‌లో విజయం సాధించిన కాంగ్రెస్-ఎన్సీ కూటమికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ కూటమికి అత్యధిక సీట్లు ఇచ్చారన్నారు. అయినా కూడా జమ్మూకాశ్మీర్‌లో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సీట్లే సాధించామన్నారు. అంతేకాకుండా ఓట్లు శాతం కూడా గణనీయంగా పెరిగిందని మోడీ వెల్లడించారు.
https://www.youtube.com/watch?v=Z0jcAMcyQRE
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!